కనురెప్పలని కోల్పోయిన ప్రముఖ హీరోయిన్
on Oct 14, 2024
ప్రముఖ బాలీవుడ్ నటి హీనా ఖాన్(hina khan)బెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నాననే విషయం తెలిసిందే.స్టేజ్ 3 లెవల్లో ఉండటంతో ప్రస్తుతం ఆమెకి కీమో థెరఫీ అనే కఠినమైన చికిత్స జరుగుతుంది.ఈ ప్రాసెస్ లో ఇప్పటికే ఆమె తన జుట్టుని కోల్పోయింది.అందుకు సంబంధించిన పిక్స్ ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది.
ట్రీట్ మెంట్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా ఇప్పుడు కను రెప్పలు కూడా పూర్తిగా పోయాయి. సోషల్ మీడియా ద్వారా విషయాన్నీ తెలియచేసిన హీనా అందుకు సంబంధించిన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ కూడా చేసింది. దీంతో మీరొక వారియర్ త్వరగా కోలుకుంటారంటూ అభిమానులతో పాటు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.పలు టెలివిజన్ సిరీస్ లలో చేసి తన అందంతో పెర్ఫార్మెన్స్ తో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న హీనా ఖాన్ హాక్డ్, అన్ లాక్, తో పాటు పలు సినిమాల్లో కూడా చేసింది.
Also Read